మొదట
సాంఖ్య అంటే విచక్షణ (తర్కించడం) అని అర్థం. అంటే ఉదాహరునకు ఒక శిష్యుడు వారి
గురువును అడుగుతాడు . గురువుగారు! నా శరీరానికి ఒక ఆత్మ అంటూ వుంది కదా అడిగాడు
శిష్యుడు. అప్పుడు గురువుగారు శిష్యునితో ... “నువ్వే ఆత్మవి, నీ కంటూ ఓ శరీరం
వుంది అంతే”
అని వివరించారు గురువుగారు. ఆ ఎరుకే
ఆధ్యాత్మిక ప్రజ్ఞ.
అంటే
ఇక్కడ దీని అర్థం మనకు విచక్షణ జ్ఞానం కలిగినపుడు, అంటే నేను ఎవరు, ఈ శరీరం, ఈ
మనస్సు మరియు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న ఆలోచన మనలో కలగడం అన్న మాట (ఆత్మానాత్మ వివేకం). అప్పుడు మనకు సత్యాన్వేషణ
మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు ఒక గురువు కావాలి. ఎందుకంటే ఎప్పుడు అయితే నీలో
సత్యాన్వేషణ మొదలవుతుందో అప్పుడు నీ మనసులో చాల చాల విషయాలను తెలుసుకోవాలను
ఉత్సాహం మొదలవుతుంది.
అదేవిదంగా
మహాభారత యుద్దములో అర్జునినికి గల సందేహాలను నివృత్తి చేయడానికి మొదలు
పెట్టినపుడు, శ్రీ కృష్ణుడు అర్జునకు తెలియజేసినదే ఈ సాంఖ్యయోగః
(ఇక్కడ
అర్జునునికి కలిగిన సందేహం ఏమిటంటే, యుద్దము జేసి నేను నా గురువులను, బంధువులను చంపి
నేను సాధించేది ఏమిటి, ధర్మాధర్మములవిచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించు
కొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను,
శరణాగతుడను, శాసింపుము)
శ్రీ
కృష్ణ భగవానుడు పలికెను – oఓ అర్జునా! శోకింపదగని వారికొరకై నీవు శోకించుచున్నావు
. పైగా జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. జ్ఞానులైనవారు
ప్రాణములు పోయిన వారి గురించిగాని, ప్రాణుములుపోని వారి గురించిగాని శోకింపరు. (2:11)
నీవుగాని,
నేనుగాని, ఈ రాజులుగాని వుండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉంటాము అనుమానమే
లేదు. (అన్ని కాలములలోను మనము వున్నాము. ఆత్మ శాశ్వతం. అది అన్ని కాలములయందు
ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు).
(2:12)
జీవునకు
ఈ దేహమునందు కౌమారం, యవ్వనం, వార్ధక్యము ఉన్నట్లే మరణానంతరం మరియొక దేహప్రాప్తియు
కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహమునొందడు. (2:13)
ఓ
కౌంతేయ! విషయేంద్రియోగమువలన శీతోష్ణములు సుఖదుఃఖాలు కలుగుచున్నవి. అవి అన్నియు
అనిత్యములు. కనుక వాటిని పట్టించుకొనకుము. (2:14)
అర్జునా!
ధీరుడైనవానికి సుఖదుఃఖాలు సమానముగా తోచును. అట్టి పురుషునికి విషయే0ద్రి సంయోగములు
చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. (2:15)
అనిత్యమైనదానికి
వునికియే లేదు. సత్యమైన ఆత్మకు లేమి అనునదిలేదు. ఈ విదముగా ఈ రెండింటియొక్క వాస్తవస్వరూపములను
తత్వజ్ఞానియైనవాడే దర్సించును . (2:16)
నాశరహితమైన
పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగును. శాశ్వతమైన
దానినెవ్వరును నశింపజేయజాలరు. (2:17)
ఓ
అర్జునా! ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితము కనుక నీవు
యుద్దము చేయుము.
(జీవాత్మ
అంటే ఆత్మ మరియు కర్మలు. ఆత్మ అంటే శాశ్వతమైనది మరియు కర్మలు అయితే వాటిని
నిష్కామంగా చేసి వాటిని వదిలించుకోవాలి.) (2:18)
ఆత్మ
ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును
అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు.
(2:19)
ఆత్మకు
చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము
చంపబదడినను ఇది చావదు. (2:20)
ఓ
పార్దా! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జననమరనములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన
పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును? (2:21)
మానవుడు
చిరిగిన పాతబట్టలను వదిలి, కొత్తబట్టలను ధరించినట్లు జీవాత్మ జీర్ణమైన శరీరమును
వీడి(వదలి) క్రొత్త శరీరములను పొందుతుంది.
(2;22)
ఈ
ఆత్మను శస్త్రములు ఛేదింపజాలదు.అగ్ని దహింపజాలదు. నీరు
తడుపజాలదు మరియు వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఈ
ఆత్మను శోషింపజేయుటకును సాద్యము కానిది. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది,
సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ
ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. నీవు దీనికై
శోకింపకు. (2:23,24&25)
పుట్టిన
ప్రతి వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. కనుక తప్పనిసరైన ఈ
విషయములయందు నీవు శోకింపదగదు. (2:27)
(పుట్టిన
ప్రతి వానికి మరణము తప్పదు.కాని మరణించిన ప్రతి వానికి జన్మము అనేది అతడి కర్మానుసారము
మరియు అతని జ్ఞాన సముపార్జన ఆధారంగా వుంటుంది. అతడు జ్ఞానాన్ని గ్రహించి(జ్ఞానయోగము
చేతను) సమస్త కర్మలను తొలగించుకొని(కర్మయోగం చేతను) వుండి అంత్య కాలమున ఆయననే (నిరాకరునిగా)
స్మరించి శరీరమును త్యజిస్తే మరల జన్మ ఉండదు.)
ఓ
అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుకకుమందు ఇంద్రియ గోచరములు కావు. మరణాంతరము గూడ
అవి అగోచరములే – ఈ జననమరణముల మధ్యకాలము నందు మాత్రమే అవి గోచరములు
అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుటవలన ప్రయోజనములేదు. (2:28)
ఎవరో
ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు
దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన
దానినిగా వినును.ఆ విన్నవారిలో, చూచినవరిలో, చెప్పినవారిలో కూడా కొందరు దీనిని
గూర్చి పూర్తిగా యెరుగరు. (2:29)
ఓ
అర్జునా! ప్రతిదేహమునందును వుండే ఆత్మ చంప వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి
అయినను నీవు శోకింపదగదు. (2:౩౦)
అంతేగాక
స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్దము
శ్రేయస్కర్మమైన కర్తవ్యము మరియొక విషయము ఏదియును లేదు. (2:31)
ఈ
యుద్దము నీకు ధర్మబద్దము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి
పారిపోయిన వాడవు అగుదువు. దానివలన నీవు కీర్తిని కోల్పోయి, పాపమూ చేసినవాడవగుదువు.
(2:౩౩)
జయాపజయాలను,
లాభనష్టాలను, సుఖదుఃఖాలు సమానముగా తలంచి యుద్దసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు
పాపములు అంటవు. (2:38)
ఓ
పార్థా! సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వ బుద్దిని గురించి తెలిపితిని. ఇపుడు
దానినే కర్మయోగద్రుక్పతముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసికొని,
ఆచరించినచో కర్మబంధములనుండి విముక్తుడవయ్యెదవు. (2:౩9)
No comments:
Post a Comment