ఈ నిష్కామకర్మయోగమును
ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు.
పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెం సాధనచేసినను అది జన్మమ్రత్యురూప
మహాభారమునుండి కాపాడును. (2:40)
ఓ అర్జునా!
ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి యుండును. కానీ భోగాసక్తులైన
వివేకహీనుల బుద్దులు చంచలములై, ఒక దారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు
తీయుచు అనంతములుగా ఉంటాయి. (2:41)
ఓ అర్జునా!
వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని
పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి
సాధనలయందును ఆశక్తిని త్యజింపుము. సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము.
నిత్యుడైన పరమాత్మయందే స్తితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపదవద్దు.
అంతఃకరణమును వశమునందుంచుకొనుము. (2:45)
అన్నివైపులా
జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయములవలన
ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందము అనుభవించు బ్రహ్మజ్ఞానికి
వేదములవలన అంతియే ప్రయోజనము వుంటుంది.
(2:46)
కర్తవ్యకర్మలను
ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు
కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. ఫలాపేక్షరహితుడై
కర్మలనాచరింపుము. (2:47)
ఓ ధనుంజయా!
యోగస్తితుడవై ఆసక్తిని వీడి, కార్యములు ఫలించినను ఫలించకున్నను సమత్వ భావమును
కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. (2:48)
ఓ అర్జునా!
ఈ సమత్వబుద్దితోకూడిన నిష్కామ కర్మకంటే ప్రతి ఫలాపేక్షతో కూడిన సకామకర్మ
తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్దియోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు
చేయువారు అత్యంతదీనులు, క్రుపనులు. (2:49)
సమత్వ
బుద్దియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా
కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ది రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే
కర్మాచరణమునందు కౌశలము. ఇదియే యోగము. (2:50)
ఏలనన
సమబుద్దియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణ బంధములనుండి
ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన, శాశ్వతమైన మోక్షపదమును పొందుదురు.
(2:51)
మోహమనెదడి
మాలిన్యము నుండి పూర్తిగా బయట పడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోకసంబందమైన
సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు. (2:52)
నానా
విధములైన మాటలను వినుటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా
నిలిచి ఉన్నప్పుడే నీకు ఈ యోగము ఏర్పడును. (2:53)
అర్జునుడు
పలికెను – ఓ కేశవా ! సమాదిస్థితుడై పరమాత్మా ప్రాప్తినందిన
స్తితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాసించును? ఎట్లు కూర్చోనును?
ఎట్లు నడుచును? (2:54)
ఓ అర్జునా!
మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వార ఆత్మయందు సంతుస్టుడైనవానిని,
అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందిన వానిని ‘స్థితప్రజ్ఞుడని’ యందురు. (2:55)
దుఃఖములు
కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును,
రాగము, భయము, క్రోధము పోయిన వాడును ఐనట్టి మననశీలుడిని ‘స్థితప్రజ్ఞుడని’ చెప్పబడును. (256)
దేనియందును
మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు
ద్వేషము మొదలగు వికారము లకు లోనుగానివాడును అగు పురుషుడు ‘స్థితప్రజ్ఞుడు’ అనబడును. (2:57)
తాబేలు
తనఅంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచు కొనునట్లుగా, ఇంద్రియములను విషయాదుల
నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్తిరముగా ఉన్నట్లు
భావించవలెను. (2:58)
ఇంద్రియముల
ద్వార విషయములను గ్రహింపనివాని నుండి ఇంద్రి యార్ధములు మాత్రమూ వైదొలగును. కాని
వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్తితప్రజ్ఞునకు పరమాత్మా సాక్షాత్కారమైనందు వలన
వాని నుండి ఆ ఆశక్తి గూడ తొలగిపోవును. (2:59)
ఓ అర్జునా!
ఇంద్రియములు మహాశక్తి కలవి, మనష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను,
ఆసక్తి తొలగిపోనంతవరకు అవి అతని మనసును ఇంద్రియార్ధములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే
యుండును. (2:60)
కనుక
సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, మత్పరయాణుడై, ధ్యానమునందు
కూర్చొననవలెను. ఏలనన ఇంద్రియములను వసమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగానుండును.
(2:61)
విషయచింతన
చేయువానికి ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకు
కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధముకల్గును. అట్టి క్రోధము వలన
వ్యామోహము కలుగును. దాని ప్రభావమున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము
వలన మనుష్యుడు పతనమగుచున్నాడు. (2:62,6౩)
ఇంద్రియములను
వశమునందు వుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వార విషయములను
గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు. (2:64)
మనోనిర్మలత్వము
వలన అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుద్ధి అన్ని
విషయముల నుండియు వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్తిరమగును. (2:65)
ఇంద్రియనిగ్రహము
మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు. అట్టి మనుష్యుని అంతఃకరణమునందు
ఆస్తికభావమే కలుగదు. తద్భావన హీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేనివానికి
సుఖము ఎట్లు లభించును ? (2:66)
నీటిపై
తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్ధముల యందు సంచరించు
ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే
మనోనిగ్రహములేని మనజుని బుద్దిని అనగా విచక్షణా శక్తిని హరించిచున్నది. కనుక ఓ
అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములుగా పూర్తిగా నిగ్రహించిన
పురుషుని యొక్క బుద్ధి స్తిరముగా ఉండును. (2:67,68)
సమస్త
ప్రాణులకూ ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని యుండును. ఎప్పుడు నశ్వరమైన
ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని యుండునో అది
పరమాత్మతత్వము నెరిగిన మునికి రాత్రిగా నుండును. (2:69)
సమస్తదిశలనుందడి
పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును సముద్రమును ఏ విధముగ చలింప చేయకనే
ప్రవేసించుచున్నవో, అలాగే సమస్తభోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములు
కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు
శాంతిని పొందలేడు. (2:70)
కోరికలన్నింటిని
త్యజించి, మమతా-అహంకార వర్జితుడై శబ్దాది విషయములపై ఎవనికి ఆశ లేదో అట్టి
పురుషునకే శాంతి లభిస్తుంది. (2:71)
అర్జునా!
బ్రహ్మీస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు.
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున
బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. అంత్యకాలము నందును ఈ
బ్రహ్మీస్తితియందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందరూపమగు మోక్షమును పొందుచున్నాడు.
(2:72)
అర్జునుడు
పలికెను? ఓ కృష్ణా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో,
భయంకరమైన ఈ యుద్దకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ? (౩:1)
అర్జునా! ఈ
లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల
యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే
చెప్పబడియున్నది. (౩:౩)
మనుష్యుడు
కర్మలను చేయకపోవుటవలన యోగనిష్టాసిద్ది అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను
త్యజించినంత మాత్రమున సాంఖ్యనిస్టను అతడు పొందడు. (౩:4)
ఎవడైనను ఏ
కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. మనుష్యలందరును ప్రకృతి
నిత్యలైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు
అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియే యుండును. (౩:5)
బలవంతముగా,
బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను
చింతించునట్టి వానిని డంభాచారి అని కపటుడు అని అంటారు. (౩:6)
అర్జునా!
మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని, అనాసక్తుడై ఇంద్రియములద్వార కర్మయోగాచరణమును
కావించు పురుషుడు ఉత్తముడు. (౩:7)
నీవు
శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే
మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్రగూడ సిద్దింపదు .(౩:8)
ఓ అర్జునా!
యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నమగుటవలన మనుష్యులు కర్మ
భంధములలో చిక్కుపడుడురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్ధమే కర్తవ్య కర్మలను
చక్కగా ఆచరింపుము. (౩:9)
కల్పాదియందు
బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వార
వ్రుద్దిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామదేనువువలె కోరిన కోర్కేలనేల్ల తీర్చునది
అగుగాక. (౩:10)
యజ్ఞశిష్టాన్నమును
తిను శ్రేష్టపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యేదరు. తమ శరీరపోషనకోరకే ఆహారము
సిద్దపరచు కొను పాపులు పాపమునారగించినవారైవున్నారు. (౩:13)
అన్నము వలన
జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ
యజ్ఞము కర్మ వలననే సంభవమగును. (౩:14)
సత్కర్మలు
యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మనుండి ఉద్భవించినవని
తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిస్టితుడై
యున్నాడు. (౩:15)
ఓ అర్జునా!
నాచే నడుపబడు ఈ లోకము అను సృష్టి చక్రమును యెవడు అనుసరింపడో (అనగా తన కర్తవ్యములను
పాటింపడో) వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు. జ్ఞాని
కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను. (౩:16)
ఎవడు
కేవలము అత్మయందే క్రీడించుచు ఆత్మ యందే సంతుష్టుడై యుండునో, అట్టి జ్ఞానికి
చేయదగిన కార్యమేదియులేదు.(౩:17)
అట్టి
మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన ప్రయోజనంగాని, చేయకుండుటవలన వలనన
దోషముగాని ఉండదు. అనగా అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్ధపరమైన సంబంధము ఏ విధముగాను
లేదు. (౩:18)
అందువలన
నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష
వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.(౩:19)
జనకుడు
మున్నగువారు ఆసక్తి రహితముగా(అనాశక్తిగా) కర్మలను ఆచరించుటవలననే పరమసిద్దిని
పొందిరి. కావున నీవును లోకహితార్ధమై కర్మలను చేయవలయును. (౩:20)
ఉత్తములైన
వారు దేని నాచరించునో, ఇతరులును దానిని ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా
అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. (౩:21)
oఅర్జునా!
ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో నేను
పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే వున్నాను.(౩:22)
ఓ అర్జునా!
అజ్ఞానులు కర్మలయందు ఆశక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞానీ కూడా లోకహితార్థమై ఫలాపేక్షలేక
కర్మలను చేయవలెను. (౩:25)
పరమాత్మస్వరూపమునందు
నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించుచు
అజ్ఞానులబుద్దులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్దను
కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో
గూడ అట్లే చేయింపవలెను. (౩:26)
వాస్తవముగా
కర్మలన్నియు అన్నివిధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార
విముడాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించుచున్నాడు. (౩:27)
ఓ అర్జునా!
గుణవిభాగతత్వమును, కర్మవిభాగ తత్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే
ప్రవర్తించుచున్నవని భావించి వాటియందు ఆశక్తినొందడు . (౩:28)
ప్రకృతి
గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును, కర్మలయందును మిక్కిలి
ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులగు అల్పజ్ఞులను, మందబుద్దులైన అజ్ఞానులను పూర్తిగా
తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు గురిచేయరాదు. (౩:29)
సమస్త
కర్మలు నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును
వదిలి నిర్భయముగా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.
(౩:౩౦)
శ్రద్ధాయుక్తులై
అసూయలేనివారై, నా ఈ అభిప్రాయమును ఏ మనుజులు అనుసరించుచున్నారో వారు అందరు కూడ
సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు. (౩:31)
ఈ
ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయములయందును మోహితులై భ్రష్టులై,
కష్టనష్టముల పాలెయ్యెదరని గ్రహింపుము. (౩:౩2)
సమస్త
ప్రాణులును తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును.
జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. కావున నిగ్రహమేమి చేయగలదు.
(౩:౩౩)
ప్రతి
ఇంద్రియార్ధమునందును రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము
కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, ప్రబలశత్రువులుగదా! (౩:34)
పరధర్మమునందు
ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా
అనుస్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు
మరణించుటటయు శ్రేయస్కర్మమే. పరధర్మాచరణము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. (౩:35)
అర్జునుడు
పలికెను – ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను
బలాత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు? (౩:36)
శ్రీ
భగవానుడు పలికెను - రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే
క్రోధరూపముగా మారును. ఇది త్రుప్తిలేనిది.పైగా అంతులేని పాపకర్మాచారణములకు ఇదియే
ప్రేరకము. కనుక ఈ కామము మోక్షమునకు పరమ శత్రువుగా ఎరుంగుము. (౩:37)
పొగచేత
అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత
జ్ఞానము కప్పబడి యుండును. (౩:38)
కామమునకు
ఇంద్రియములు, మనస్సు,బుద్ధి నివాసస్థానములు. ఈ కామము మనో బుద్ధీంద్రయముల ద్వారా
జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మొహితునిగా చేయును. (౩:40).
కావున ఓ
అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము. పిదప జ్ఞానవిజ్ఞాములను నశింపజేయునట్టి
మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనొడ్డి పూర్తిగా విడువుము. (౩:41)
స్థూలశరీరముకంటెను
ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు, దాని కంటెను బుద్ధి గొప్పది. ఆ
బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది, సూక్ష్మమైనది ఆత్మ.ఈ విదముగా బుద్దికంటేను ఆత్మ
అతీతమైనదని తెలిసికొని, బుద్ధిద్వారా మనస్సును వశపరుచుకొని, జయింపశక్యముకాని
శత్రువైన కామమును సంహరింపుము. (౩:42,43)
No comments:
Post a Comment