అర్జునుడు
పలికెను – కృష్ణా! అంతర్యామి! వాసుదేవా! సన్యాసతత్వమును, త్యగాతత్వమును వేర్వేరుగా
తెలిసికోనగోరుచున్నాము.(18:1)
శ్రీభగవానుడు
పలికెను – జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ
మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. (18:2)
కొందరు
విద్వాంసులు కర్మలన్నియును దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని యందురు. కాని
యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు. (18:౩)
ఓ అర్జునా!
సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమునుగూర్చి నా నిశ్చయమును
వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా వున్నాయి.(18:4)
యజ్ఞదానతపశ్చర్యాది
కర్మలు త్యజింపదగవు. అవి విధిగా ఆచరింపదగినవి. విడువదగినవికావు. (18:5)
కావున ఓ
పార్థా! ఈ యజ్ఞదాన తపోరూపకర్మలను మరియు కర్తవ్యకర్మలను అన్నింటి ఫలాసక్తులను
వదిలి, అవస్యమాచరించవలెను. అనునది ఉత్తమమైన నా నిశ్చిత ఉత్తమాభిప్రాయము. (18:6)
శాస్త్రవిహితకర్మలు
వదలుట సరిగాదు. కావున మొహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అని చెప్పబడుతోంది.(18:7)
కర్మలన్నియును
దుఃఖాన్నిచ్చేవే యని భావించి, శారీరికక్లేశమునకు భయపడి, కర్తవ్యకర్మలను త్యజించుటను
రాజసత్యాగము అని అంటారు. రాజసత్యగము చేయువాడు త్యాగఫలమును పొందలేడు. (18:8)
అర్జునా!
శాస్త్రయుక్తమైన విధులు కర్తవ్యములుగా భావించి వాటియందలి ఫలాశక్తులను త్యజించి,
చేయుటయే సాత్విక త్యాగము అని చెప్పబడినది.(18:9)
కర్మలను
ద్వేషింపనివాడు, కుశలకర్మలయందు ఆశక్తి చూపాడు, శుద్డసత్వగుణయుక్తుడు,
సంశయలేనివాడు, బుద్ధిమంతుడు ఐనవాడు నిజమైన త్యాగి.(18:10)
ప్రతి
శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట సాధ్యముకాదు. కావున కర్మలను గాక
కర్మఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును.(18:11)
కర్మములు
ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు
జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కాని కర్మఫలత్యాగమొనర్చిన యోగులు (కోరని
వారు) ఆ ఫలములను ఏ కాలమునందైనను, ఏ విధముగను అనుభవించవలసిన పనికలుగదు (జన్మాంతరమున
పొందజాలకున్నారు). (18:12)
అర్జునా!
సర్వకర్మలసిద్దికి ఐదు కారణములు గలవని కర్మలను అంతముచేయు ఉపాయములను తెలుపు
సాంఖ్యశాస్త్రమునందు పేర్కొంది. వాటిని నా వలన వినుము.(18:13)
కర్మల
సిద్దియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు నానావిధ చేష్టలు, దైవము అను
ఐదును కారణములు.(18:14)
మానవుడు
మనో వాక్కాయములచే ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన యే కర్మలైనను ఈ ఐదు
కారణములై యున్నవి.(18:15)
అట్లైనప్పటికి
విపరీతబుద్ది కారణమున ఏ మనుష్యుడు కేవలుడు శుద్దస్వరూపుడైన ఆత్మను సమస్తకర్మలకు
కర్తగా భావించునో, అట్టి మలినబుద్దిగల అజ్ఞాని సత్యమును తెలుసుకొనలేకున్నాడు.(18:16)
అంతఃకరణమునందు
కర్తృత్వభావము లేనివనిబుద్ది ప్రాపంచిక విషయములయందు, కర్మలయందును అంటుకొనదు. అట్టి
పురుషుడు ఈ లోకములను అన్నింటిని హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతడు
ఎత్తి కర్మలచేత బందింపబడడు.(18:17)
జ్ఞాత,
జ్ఞానము, జ్ఞేయము అనునవి మూడును కర్మప్రవ్రుత్తికి కారణములు. కర్మప్రేరణములు.
కర్త, కర్మ, క్రియ అని కర్మసంగ్రహములు మూడును ఆధారములు.(18:18)
గుణముల
సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో
ముడేసి విధములుగా చెప్పబడినవి. వానిని గూర్చి వివరించెదను వినుము.(18:19)
వేర్వేరుగా
కన్పించు సమస్త ప్రాణులయందును శాస్వతుడైన పరమాత్మయే విభాగారహితుడుగా సమభావముతో
స్తితుడై యున్నట్లు జ్ఞానియైన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక
జ్ఞానము అని చెప్పబడుతోంది.(18:20)
సమస్త
ప్రాణులయందును నానావిధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించువారి జ్ఞానము
రాజసము.(18:21)
ప్రక్రుతికార్యమైన
శరీరమునే సమస్తముగా భావించి, దానియందే ఆశక్తిని కల్గించునట్టిదియు, తత్వికముగా
అర్ధరహితమైనదియు, హేతుబద్దము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము
అని చెప్పబడుతోంది.(18:22)
కర్త్రుత్వాభిమానము
గాని, ఫలపేక్షలేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మ
సాత్విక కర్మ అనబడుతోంది. (18:23)
భోగలాలసుడైన
పురుషునిచేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి ఆయాసంతో కూడిన కర్మ రాజసకర్మ
అనబడుతోంది.(18:24)
పరిణామము
హాని, హింస, సామర్ధ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానంచే మొదలుపెట్టిన కర్మలు తామస
కర్మలు అని చెప్పబడుచున్నాయి. (18:25)
ఆసక్తిని
త్యజించినవాడు, అహంకారరహితముగా మాట్లాడువాడు, ధైర్యోత్సాహములుగలవాడును సిద్ది – అసిద్దుల
యెడ హర్శశోకాదివికారములకు లోనుకానివాడును అగు పురుషుడు సాత్వికకర్త యని
చెప్పబడుచున్నాడు. (18:26)
ఆసక్తియుతుడు,
కర్మఫలములకై ఆరాటపడువాడు, లోభి, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర
ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోనగువాడు రాజసకర్త అని చెప్పబడ్డాడు. (18:27)
జితేంద్రియుడు
కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు మొండివాడు, ధూర్తుడు, ఆకారణముగా ఇతరుల
వృత్తులకు విఘాతముగా కల్గించువాడు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కర్యాచరణమునందు
ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను (దీర్ఘసూత్రి) – లక్షములను
గలవాడు తామసకర్త అని చెప్పబడ్డాడు. (18:28)
అర్జునా!
కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది
సత్వగుణ సముద్భనమని ఎరుగుము. (18:౩౦)
ఓ
పార్ధ! ధర్మధర్మములయయొక్కయు, కర్యాకార్యముల యొక్కయు, యదార్థ తత్వములను తెలియజాలని
బుద్ధి రాజసబుద్ది యనబడుతోంది. (18:31)
ఓ
అర్జునా! తమోగుణావ్రుతమైనందున అధర్మమును ధర్మముగను, అట్లే ఇతర విషయములను
తద్విపరీతముగను భావించు బుద్దిని తామస బుద్ధి అంటారు. (18:32)
అర్జునా!
ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వార మనఃప్రానేంద్రియ క్రియలను
ధారణచేయు శక్తిని సాత్వికధృతి అంటారు. (18:౩౩)
ఓ
అర్జునా! కర్మఫలేచ్చగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్ధకామవిషయములను ధారణచేయు
శక్తిని రాజసద్రుతి అంటారు.(18:34)
నిద్ర,
భయము, చింతాశోకములు విడువక దుర్మతియైన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయు చుండును.
అట్టి ధృతిని తామసధ్రుతి అంటారు. (18:35)
ప్రారంభమున
విషతుల్యముగా గోచరించినప్పటికిని పరిణామమున అమృతతుల్యమైన పరమాత్మకు సంబందించిన
విషయములలో నిమగ్నమగునో, అట్టి సుఖమును సాత్వికసుఖము అంటారు. (18:37)
విషయే౦ద్రియ
సంయోగమువలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమ్రుతతుల్యముగ అనిపించినను
పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజససుఖము అంటారు. (18:38)
నిద్ర,
సోమరితనము, మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామససుఖము అనబడుచున్నది. ఇట్టి సుఖము
భోగాసమయము నందును, పరిణామము నందును జీవిని మొహింపజేస్తుంది. (18:39)
ప్రుధివియందు
గాని, ఆకాశమునందుగాని, దేవతలయందుగాని, మరేఇతర లోకములయందుగాని, ప్రక్రుతినుండి
ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణియు కనబడదు. (18:40)
సమస్త
ప్రాణుల పుట్టుక పరమేశ్వరునినుండియే జరిగినది. సమస్త జగత్తు నందును అతడే
వ్యాపించియున్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వార పూజించి,ఆరాధించి
మానవుడు సిద్ధిని పొందుచున్నాడు. (18:46)
బాగుగా
ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణరహితమైన స్వధర్మాచారణమే శ్రేష్టమైనది. స్వభావమును
అనుసరించి కర్మలను ఆచరించు మనుజుడు ఎట్టి పాపము నొందడు. (18:47)
ఓ
అర్జునా! ప్రాపంచిక పదార్థములయందు ఆసక్తి లేనివాడును, స్ప్రుహారహితుడును, అంతఃకరణమును
జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వార పరమశ్రేష్ఠమైన నైష్కర్మ సిద్ధిని
పొందుచున్నాడు. (18:49)
విశుద్దమైన
బుద్దితో, ధైర్యముతో అత్మనిగ్రహముతో శబ్దాది విషయములను విడచి, రాగద్వేషాదులకు
అతీతముగా.... పరిశుబ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్వికధారణా
శక్తిద్వార అంతఃకరణే౦ద్రియముల సంయమము కలిగి, మనోవాక్కాయ ములను అదుపులో
వుంచుకొనినవాడు, రాగద్వేషములను అన్ని వేళలా త్యజించి, ధృడమైన వైరాగ్యమును
సంపూర్ణముగా ఆశ్రయించినవాడు.అహంకారము, బలమును, దర్పమును, కామక్రోధములను,
పరిగ్రహమును వదిలి, ఎల్లప్పుడు ధ్యానయోగ పరాయణుడై యుండువాడు, మమతా రహితుడు,
శాంతియుతుడు ఐన పురుషుడు పరబ్రహ్మమునందు అభిన్నభావముతో స్థితుడగుటకు
సమర్దుడగుచున్నాడు .(18:51-5౩)
పరబ్రహ్మయందు
ఏకీభావస్థితుడై ప్రసన్నమనస్కుడైన యోగి దేనికిని శోకింపడు, దేనిని కాంక్షింపడు.
సమస్తప్రాణులయందును సమభావముగల అట్టి యోగి నా పరాభక్తిని పొందుచున్నాడు. (18:54)
బ్రహ్మభూతుడైన
యోగి ఈ పరాభక్తి ద్వారా నేనెవరినో? ఎంతటి వాడనో? యథాతథముగ నా తత్వమును
తెలిసికొనుము. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నా యందే
లీనమగుచున్నాడు. (18:55)
సమస్తకర్మలయందును
కర్తృత్వభావమును వదిలి, ఆయాకర్మల ఫలరూపమైన సమస్తభోగములను త్యజించి, నన్నే
ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటిని సర్వదా చేయుచును నాకృప సనాతనమైన శాశ్వతమైన
మోక్షమును పొందుచున్నాడు. (18:56)
సర్వకర్మలను
మనసా, వాచ, కర్మణా నాకే సమర్పించి సమబుద్ది రూపయోగమును అవలంబించి, మత్పరాయణుడవై
సంతతము చిత్తమును నాయందే గలవాడవు కమ్ము. (18:57)
పైన
తెలుపబడిన విధముగా నాయందు(పరమాత్మా) చిత్తమును నిల్పినచో, నా కృపవలన సమస్త కష్టముల
నుండియు సునాయాసముగా బయట పడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన
బెట్టినచో చేడిపోవుదువు. (18:58)
ఈశ్వరుడు
యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు
రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. (18:61)
అర్జునా!
అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే (పరమాత్మనే) శరణుకోరుము. అతని కృపచేతనే పరమశాంతిని,
శాశ్వతమైన మోక్షమును పొందగలవు. (18:62)
ఓ
అర్జునా! నీవు నాయందే మనస్సునుంచుము.నా భక్తుడవు కమ్ము. నన్నే సేవింపుము. నాకు
ప్రణమిల్లుము. ఇట్లు చేయుటవలన నన్నే పొందగలవు. అది ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
ఎందుకంటే నీవు నక్కు ప్రీతి పాత్రుడవు కనకు ఈ విషయమును నీకు చెప్పుచున్నాను.(18:65)
సర్వధర్మములను
అనగా సమస్తకర్తవ్యకర్మలను నాకు సమర్పించుము. సర్వశక్తిమంతుడను, సర్వాధారుడను
పరమేశ్వరుడను ఐన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపములనుండియు నిన్ను నేను
విముక్తిడిని గావించెదను. నీవు శోకింపవలదు. (18:66)
తపస్సంపన్నుడు
కానివానికి, భక్తిరహితునకు, నన్ను ద్వేషించువానికి నీవు ఈ గీతారూపరహస్యోపదేశమును
ఎన్నడును చెప్పరాదు. (18:67)
నా
యందు పరమభక్తి గలిగి, ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా
భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు. (18:68)
మనుష్యులలో
అతనిని మించిన భక్తుడేవ్వడును లేడు. అంతేగాక అతనివలె గాని, అతనిని మించిగాని నాకు
ప్రియమైన వాడు ఈ భూమండలమున మరియొకడు లేడు. (18:69)
ధర్మయుక్తమైన
మనసంవాదరూపమైన ఈ గీతశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వార నన్ను పూజించువాడని
నా ఉద్దేశ్యము. (18:70)
శ్రదాదరములుగాలవాడును,
దోషద్రుష్టి లేనివాడును ఐన మనుష్యుడు గీతాజ్ఞానమును వినుటవలన గూడ పాపవిముక్తుడై,
పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందుచున్నాడు. (18:71)
ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా
వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? (18:72)
కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు
సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. (18:7౩)
No comments:
Post a Comment