పదవ అధ్యాయం విభూతి యోగః లో, భగవానుడు నేనే ఈ సమస్త జగత్తు
అంతను అయి ఉన్నను.అంటే మన కంటికి కనిపించే ఈ మొత్తం చరాచర (ప్రకృతి అంతయు) జగత్తు
అంతయు నేనే అయి ఉన్నను.ఈ జగత్తు అంతయు యోగ మాయచే నిర్మితమైనది, నేను కాకుండా అంటూ
ఈ కనించే ప్రకృతిలో ఏదియును లేదు అదేవిధంగా కనిపించని ఆ స్వస్వరూపమైన ,
నిరాకారమైన, శాస్వతమైన్, సత్యమైన, నిత్యమైన, పురాతనమైన, అందరి హృదయాలలో వున్న ఆ
చిదానంద స్వరూపుడనైన ఆ ఆత్మ ను కూడ నేనే అని వివరించినాడు.
నా
ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని, మహర్షులుగాని
తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్నివిధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును
ములకారణమైనవాడను నేనేగదా! (10:2)
నన్ను
యదార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగాను సకలలోక మహేశ్వరునిగను
తెలిసికొనువాడు మానవులలో జ్ఞానీ, అట్టివాడు సర్వపాపములనుండియు విడివడుచున్నాడు.
(10:౩)
నిశ్చయాత్మకశక్తి,
యదార్థజ్ఞానము, మొహరాహిత్యము, క్షమ, సత్యము ,దమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి
ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి
అనునవి ప్రాణులకు నావలననే కలుగుచున్నవి. (10:4,5)
కశ్యాపాది
మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట
వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)
ఈ
సమస్తజగత్తుయొక్క ఉత్పత్తికి నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ
విషయము బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తీశ్రద్దలతో నిరంతరము నన్నే
సేవించుచున్నారు. (10:8)
నా భక్తులు
నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు .తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ
సర్వస్వమును నాకే అంకిత మొనర్తురు. నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు
గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు . నిరంతరము సంతుష్టులగు చుందురు.
(10:9)
అట్లు
నిరంతరము ధ్యానాదులద్వార నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్దలతో నన్నే భజించువారికి
నేను బుద్దియోగమును అనగా తత్త్వయోగమును అనుగ్రహించుచున్నాను. (10:10)
ఓ అర్జునా!
వారి అంతః కరణములయందు స్తితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన
తత్త్వజ్ఞానరూప దీపమును (జ్యోతిని) వెలిగించి వీరి అజ్ఞానందకారమును
పోగొట్టుచున్నాను. (10:11)
అర్జును
పలికెను – నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమపవిత్రుడవు.
నిన్ను సనాతనుడవనియు, దివ్యపురుషుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు
ప్రస్తుతింతురు. (10:12)
ఓ కేశవా!
నీవు చెప్పునది అంతయు సత్యమే .హి భగవాన్ ! నీ లీలామయస్వరూపమును దేవతలు గాని
దానవులు గాని తెలియలేరు. (10:14)
ఓ
జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేషు! ఓ దేవాదిదేవా! ఓ జగన్నాథా! ఓ పురుషోత్తమా! నీ
తత్త్వమును నీవే ఎరుగుదవు. (10:15)
ఓ
యోగీస్వరా! నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏవిధముగా తెలిసికోనగలను? హే భగవాన్? ఏ యే
భావములతో నాద్వార చింతన చేయదగినవాడను ? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను. (10:17)
సమస్తభూతముల
మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే
కారకుడను.
ఓ అర్జునా!
సమస్త ప్రాణుల హృదయములందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. సకల భూతముల ఉత్పత్తి, పెంపు
నాశములకు నేనే కారకుడను (ఆదియు,మధ్యస్థితియు అంతము నేనే). (10:20)
అదితియొక్క
ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో సూర్యుడను
నేను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. తారలయందు చంద్రుడను నేను. (10:21)
వేదములలో
నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేన్. ఇంద్రియములలో మనస్సును నేనే. ప్రాణులలో
చైతన్యమును నేనై యున్నాను. ఏకాదశరుద్రులలో శంకరుడను నేను .యక్షరాక్షసులలో
ధనాదిపతియైన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు
పర్వతమునై యున్నాను (10:22,23)
రాక్షసులలో
ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే.
(10:౩౦)
ఓ అర్జునా!
సృష్టికి ఆదిమద్యాంతములు నేను. విద్యలలో ఆధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను.
వాదించు వారిలో నేను వాదమును. (10:32)
అన్ని
ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే . (10:34)
లోకమునందు
ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము
వలననే సంభవములు. (10:41)
ఓ
అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున
నేను కానిది ఏదియును లేదు. ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి ఒక్క అంశతోడనే
నేను వ్యాపించియున్నాను.(10:42).
No comments:
Post a Comment