అర్జునుడు
పలికెను – ఓ కృష్ణా ! ఒకసారి కర్మసన్యాసమును, మరియొకసారి
కర్మయోగమును ప్రశంసించున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో
తెలియజేయుము. (5:1)
అప్పుడు
భగవానుడు, అర్జునా! కర్మసన్యాసము, కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగజేయును.
కానీ ఈ రెండింటిలోను కర్మసన్యాసం(కర్మ పరిత్యాగము) కంటెను కర్మయోగము(కర్మానుష్టానమే)
శ్రేష్టమైనది. (5:2)
ఓ
మహాబాహో! ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్యాసిగా
ఎరుంగవలెను. ఏలనన రాగాద్వేషాది ద్వంద్వందములు లేనివాడు అవలీలగా సంసారబంధముల నుండి
విముక్తడగును. (5:౩)
సాంఖ్య, కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు.
పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి
ఫలస్వరూపమైన పరమాత్మను పొందుచున్నాడు. (5:4)
జ్ఞానయోగులు
పొందు మోక్షమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగఫలమును, కర్మఫలయోగమును ఒక్కటిగా
చూచువాడే నిజముగా గ్రహించినవాడగును. (5:5)
ఓ
అర్జునా! కర్మయోగమును అనుస్టింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములద్వార
జరుగు కర్మలన్నింటి యందును కర్త్రత్వమును త్యజించుట కష్టము. భగవత్సరూపమును మననము
చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందుచున్నాడు. (5:6)
కర్మయోగము
నాచరించువాడు మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణసుద్ది
కలవాడు, సర్వప్రాణులలో అత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మకలవానికి కర్మలను
ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు. (5:7)
పరమార్దతత్వమును
నెరిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్ప్రుశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు,
నడుచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు,
గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమతమ విషయముల యందు
వర్తించుచున్నవనియు, తనేమియు చేయుటలేదనియు తలంచును. (5:8.9)
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక కర్మలన్నింటిని భగవదార్పనము గావించి కర్మల
నాచరించునో, ఫలాశక్తిరహితముగా కర్మలనాచరించు వాడు తామరాకుకు నీటిబిందువులు అంటని
రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
కర్మయోగులు
ఫళాశక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వార అంతఃకరణ
శుద్దికై కర్మలను ఆచరించుచున్నారు. (5:11)
నిష్కామకర్మయోగి
కర్మఫలమును త్యజించి, భాగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన
వాడు కర్మలనాచరించి బద్దుడగు చున్నాడు.
(5:12)
ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములుగల శరీరమునందు సమస్తకర్మలను మానసికముగా
త్యజించి, పరమాత్మస్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించుచున్నాడు. (5:13)
భగవంతుడు
జీవుల యొక్క కర్త్రుత్వమునుగని, వారి కర్మలనుగని, కర్మఫలసంయోగామును గాని సృజింపడు.
ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది. సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల
పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాదు. అజ్ఞానముచే జ్ఞానముకప్పబడి యుండుటవలన
ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు. (5:14,15)
ఎవని అజ్ఞానము,
జ్ఞానము(పరమాత్మ తత్వము) చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి
పరమార్థతత్వమును జూపును. (5:16)
పరమాత్మయందే
నిరంతరము ఏకీభావముతో స్తితులై, తత్పరయానులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై,
పునరావ్రుత్తిరహితమైన శాశ్వత పరమగతిని పొందుచున్నారు. (5:17)
విద్యవినయ
సంపన్నుడైన బ్రాహ్మణునియందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని
యందును సమదృష్టిని గలవానినే జ్ఞానీ అందురు. (5:18)
ఎవరి
మనస్సు సమభావమందు స్తిరమై యున్నదో అట్టివారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన
వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్తితికి చేరుదురు. పరమాత్మ దోషరహితుడు, సముడు,
అందువలన సమభావస్తిత మనస్కులైన వారు బ్రహ్మమునందున్న వారెయగుదురు. (5:19)
స్థిరమైన
బుద్దిగలవాడును, మొహవివశుడు అయిన బ్రహ్మవేత్త ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషముగాని,
అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు. (5:20)
ప్రాపంచిక
విషయములయందు అనాసక్తమైన అంతఃకరణముగల సాధకుడు ఆత్మస్తితిధ్యాన జనితమైన
సాత్వికాత్మానందమును పొందును. పిదప అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై,
అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. (5:21)
ఓ
అర్జునా! విషయే0oద్రియ సంయోగమువలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు
సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుంఖఃహేతువులే. ఆధ్యంతములు గలవి. అనగా
అనిత్యములు. వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. (5:22)
ఎవరు
ఈ శరీరము విడువకముందే అనగా జీవించి యుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో
నుంచుకోనునో (అరిషడ్వర్గములను జయించునో) అతడే నిజమైన ఆత్మానంద యోగి. (5:23)
ఎవరు
అంతరాత్మయందే సుఖించుచు, అత్మయందే రమించునో, అట్టి ఆత్మజ్ఞానియైన సాంఖ్యయోగి,
పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్తితుడై యుండునో అతడు బ్రహ్మ సాక్షాత్కారము పొందును.
(5:24)
పాపరహితులును,
జ్ఞానప్రభావమున సమస్తసంశయములను నివృత్తిని సాధించినవారు, సర్వప్రాణులహితమును గోరు
ఋషులు, బ్రహ్మనిర్వాణ మును పొందుచున్నారు. (5:25)
కామక్రోధములు
లేనివారు, మనోనిగ్రహము కలవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారము పొందిన
జ్ఞానులకు అంతటను పరబ్రహ్మపరమాత్మయే గోచరించును. (5:26)
బాహ్య
విషయభోగములను చింతచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమద్యమునందును స్తిరముగా
ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్తితిలో నడుపవలెను. ఈ
ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఎవడు
ఈ విధముగా ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను
స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో
అట్టివాడే ముక్తుడనబడును ఇట్టి సాధనలవలన మోక్షపరాయణుడైన సాధకుడు
ఇచ్చాభయక్రోధరహితుడై ఎల్లప్పుడూ ముక్తుడగును. (5:27,28)
భగవంతుడు
సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, ఇట్టి భగవత్తత్వమును
ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఆ విధముగా నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును
పొందుచున్నాడు (5:29)
No comments:
Post a Comment