Wednesday, February 12, 2014

అధ పంచదశోధ్యాయ (15వ) అధ్యాయం : పురుషోత్తమయోగః

శ్రీ కృష్ణ భగవానుడు పలికెను ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే ఆకులుగా గల ఈ సంసారరూప అశ్వత్ధవృక్షము శాశ్వతమైనది. ఏ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను తెలిసిన వాడు. (15:1)
ఈ సంసార వృక్షమును త్రిగుణములనెడి జలములు తడుపుచుండెను. ఆ జలములచే వృద్దిపొందు శాఖలే దేవమనుష్యతిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్ళు విషయభోగములు. ఈ శాఖముల చిగుళ్ళు సర్వత్ర వ్యాపించి యున్నవి. మనుజులను కర్మానుసారముగా బందించు అహంకార మమకార వాసనలనేడి వేర్లు, ఊడలు అన్ని లోకములలోనూ క్రింద, పైన వ్యాపించి ఉన్నవి. (15:2)
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము గాదు. ఇది ఆదియు, అంటాము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకారము కారవసనారూపములైన ధృడమైన వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్ధవృక్షమును సునిశితమైన వైరాగ్యమనెడి శస్త్రముతో ఖండించి... అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగ అన్వేషింపవలెను. ఈ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు మరలరారు. అట్టి పరమేశ్వరునినుండియే ఈ సనాతనమైన సంసారవృక్షపరంపర విస్తరించియున్నది. అట్టి పరమాత్ముని శరణుపొంది, ధ్రుడ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని సదా మనన, నిదిధ్యాసాదులు చేయవలెను. (15:౩,4)
దురభిమానమును, మోహమును వదిలిపెట్టినవారు, ఆసక్తియను దోషమును జయించినవారును, ప్రాపంచికవాంచలవదిలినవారు పరమాత్మ స్వరూపము నందు నిత్యము చలించువారు, సుఖదుఃఖాదిద్వంద్వందముల నుండి విముక్తులైనవారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. (15:5)
స్వయంప్రకాశస్వరూపమైన ఆ పరమాత్మను సూర్యుడు గాని, చంద్రుడుగాని, అగ్నిగాని ప్రకశింపజేయజాలరు. అట్టి పునరావృత్తి రహితమైనదే మోక్షపధము, పరంధామము. అట్టి ఉత్తమ పథమునకు  చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు. (15:6)
ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రక్రుతి యందు స్థితములైన మనసు ఇంద్రియములను శబ్దాది విషయములద్వార తనవైపు ఆకర్షించును. (15:7)
వాయువు వాసనలను ఒకచోటినుండి మరొకచోటికి తీసికొని పోయినట్లుగా దేహాదులకు స్వామియైన (ఆత్మను) జీవాత్మ ఒక శరీరమును త్యజించునపుడు, మనస్సును ఇంద్రియములను గ్రహించి, వాటితో గూడ మరొక శరీరమును పొందును. (15:8)
ఈ జీవాత్మ పంచేంద్రి యములను, మనస్సును ఆశ్రయించి, శబ్దాది విషయములను అనుభవించును. (15:9)   
జీవాత్మ శరీరమును త్యజించినపుడు, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయభోగములను అనుభవించు చున్నప్పుడును, త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలిసికొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును తెలిసికొనుచున్నారు. (15:10)
అంతః కరణశుద్దిగలయోగులు తమహృదయముల యందున్న ఈ అత్మతత్వమును ప్రయత్నించి తెలిసికొనగలరు. కానీ అంతఃకరణశుద్దిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు, ఈ ఆత్మను తెలిసికొనజాలరు. (15;11)
సర్వజగత్తును ప్రకాశింపజేయు సూర్యునితేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని తెలిసికొనుము. (15:12)
దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. (15:14)
అన్ని ప్రాణుల హృదయములలో అంతర్యామిగా వున్న వాడను నేనే. ననుండియే స్మృతి, జ్ఞానము, మరపు కలుగుచున్నవి. వేదముల ద్వార తెలిసికొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను గూడ నేనే. (15:15)
ఈ లోకమునందు క్షరుడు (నశ్వరుడు), అక్షరుడు (వినాశము లేనివాడు) అని పురుషులు రెండు విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ (అంటే ఆత్మ+కర్మలు) నాశరహితుడు. (15:16)
(జీవాత్మ ఎప్పుడైతే అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకుంటుందో అప్పుడు పరిపూర్ణమైన ఆత్మ, పరమాత్మ సాగరంలో విలీనమవుతుంది)
పై ఇద్దరికంటేను  ఉత్తముడైన పురుషుడు వేరైనవాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు మూడులోకములయందును ప్రవేశించి అందరిని భరించి పోషించుచున్నాడు. (15:17)
నశ్వరమగు క్షేత్రము (శరీరము) కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును, వేదముల యందును పురుశోత్తముడనని ప్రసిద్దికెక్కితిని. (15:18)   

ఓ అర్జునా! జ్ఞానియైనవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. (15:19)

No comments:

Post a Comment